ICC World Cup 2019: David Warner Fit For Afghanistan Match At Bristol!! | Oneindia Telugu

2019-06-01 91

Captain Aaron Finch confirmed the news in the evening after he passed the fitness test at training. This implies, Australia will hold their same opening combination as that of the 2015 World Cup, when they commence their title-defense in Bristol against Afghanistan. However, Finch did mention that Australia are yet to lock in their playing XI for the opener where Usman Khawaja and Shaun Marsh are fighting for the No.3 spot. Along with the batters, the bowling combination is also yet to be finalised upon.
#icccricketworldcup2019
#DavidWarner
#Injury
#Afghanistan
#SriLanka
#aronfinch
#khawaja
#australia

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ తెలిపాడు. బ్రిస్టల్‌ వేదికగా ఈ రోజు మధ్యాహ్నం డిపెండింగ్ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో అఫ్గానిస్థాన్‌ తలపడనుంది. వార్మప్ మ్యాచ్‌లో వార్నర్‌ గాయపడిన విషయం తెలిసిందే. వార్నర్‌కు ఫిట్‌నెస్‌ టెస్ట్ నిర్వహించిన అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటాం అని గురువారం ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ ఓ ప్రకటనలో తెలిపాడు.

లాంగర్ ప్రకటనతో వార్నర్‌ అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడుతాడో లేదో అని అనుమానాలు నెలకొన్నాయి. అయితే శుక్రవారం వార్నర్‌ ఫిట్‌గా ఉన్నాడు. తొలి మ్యాచ్ ఆడుతాడు అని ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ స్పష్టం చేసాడు. దీంతో రెగ్యులర్ ఓపెనర్ ఫించ్‌తో కలిసి వార్నర్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. వార్నర్‌ గైహాజరీతో గత కొంత కాలంగా ఓపెనర్‌గా నిలకడగా రాణిస్తూ వస్తున్న ఉస్మాన్ ఖవాజ మూడో స్థానానికి పరిమితం కానున్నాడు.